: నేడు పుతిన్ ను కలవనున్న మన్మోహన్
భారత ప్రధాని మన్మోహన్ సింగ్ నేడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ కానున్నారు. రష్యా పర్యటనకు వెళ్ళిన మన్మోహన్ కు నిన్న మాస్కో విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. కాగా, కుడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టులోని 3వ, 4వ రియాక్టర్ల నిర్మాణంలో రష్యా తోడ్పాటుపై మన్మోహన్.. పుతిన్ తో చర్చించనున్నారు. తన రష్యా పర్యటన సందర్భంగా మన్మోహన్ మాట్లాడుతూ, 'కీలక అంశాల్లో ఇరు దేశాల భాగస్వామ్యంపై సమీక్షించుకుంటాం. అణుశక్తి, రక్షణ రంగ సహకారం, సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్ష రంగంలో తోడ్పాటు, వాణిజ్యం, పెట్టుబడులు తదితర అంశాలపై చర్చిస్తాం' అని చెప్పారు.