: సీమాంధ్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తాం: దిగ్విజయ్
సీమాంధ్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తొందరపడి రాజీనామాలు చేయొద్దని ఢిల్లీలో మీడియా ద్వారా కోరారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కావాలన్న మంత్రి పనబాక లక్ష్మి డిమాండ్ ను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అయితే, 'ఫైలిన్ ను నిలువరించలేకపోయాం కానీ.. విభజన తుపాను ఆపుతాం' అంటూ సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలపై విలేకరులు అడగ్గా.. దిగ్విజయ్ సమాధానాన్ని దాటవేసి వెళ్లిపోయారు.