: ప్రత్యామ్నాయం చూడాలి: ఒమర్ అబ్దుల్లా
పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఎల్ఓసీ వెంబడి అరాచకాలకు తెగబడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం సరికాదని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. శ్రీనగర్ లో ఆయన మాట్లాడుతూ, తక్షణం ప్రత్యామ్నాయాన్ని ఆలోచించాలని, పాక్ దురాగతాలకు అడ్డుకట్ట వేసే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.