: పశ్చిమబెంగాల్లో బాల్య వివాహ మహోత్సవాలు
పండుగల రోజుల్లో ఎన్నెన్నో ఉత్సవాలు చూసి ఉంటారు. అయితే, పశ్చిమబెంగాల్లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాకు వెళ్లి చూస్తే బాల్య వివాహాలు పెద్ద ఎత్తున జరగడం కనిపిస్తుంది. బాల్య వివాహాలు చట్టవిరుద్ధం. అయినా అక్కడ గిరిజనులు బాల్య వివాహాలను ప్రోత్సహిస్తూనే ఉంటారు. జంగల్ మహల్ గా పేర్కొనే ఇక్కడ ప్రస్తుతం మావోయిస్టుల హింస తగ్గిపోవడంతో, గిరిజనులు భయం లేకుండా చిన్న పిల్లలకు పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరిపించడానికి ముందుకు వస్తున్నారని సుచేతన అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. బిన్ పూర్ లో వేలాది మంది పాల్గొనే వివాహ మేళాను ఉదాహరణగా పేర్కొంది.