: జపాన్ లోనూ విడుదల కానున్న సల్మాన్ 'ఏక్ థా టైగర్'
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇక జపాన్ లోనూ హల్ చల్ చేయనున్నాడు. సల్మాన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఏక్ థా టైగర్' జపాన్ లోనూ విడుదల చేయాలని ఆ చిత్ర నిర్మాతలు నిర్ణయించారు. టోక్యోతో పాటు ఇతర ప్రధాన నగరాల్లో ఈ సినిమా మార్చి 7న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఆ హిట్ సినిమా దర్శకుడు కబీర్ ఖాన్ ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొనేందుకు టోక్యోలో ఉన్నారు. గత ఆగస్టు 15న విడుదలైన 'ఏక్ థా టైగర్' వంద కోట్ల క్లబ్ లో చేరిన సంగతి తెలిసిందే.