: కాశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోం: అమెరికా
దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా మిగిలిపోయిన కాశ్మీర్ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలన్న పాకిస్థాన్ విజ్ఞప్తిని అగ్రరాజ్యం అమెరికా తిరస్కరించింది. వివాదాస్పద కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకునే ప్రస్తక్తే లేదని తేల్చి చెప్పింది. కాశ్మీర్ అంశం విషయంలో తమ విధానాలను మార్చుకోబోమని ఆ దేశ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి అమెరికా జోక్యం కావాలని పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అభిప్రాయపడిన నేపథ్యంలో అమెరికా ఈ ప్రకటన చేసింది.