: న్యూజెర్సీ అసెంబ్లీకి చివుకుల ఉపేంద్ర పోటీ
న్యూజెర్సీ అసెంబ్లీకి నవంబరు ఐదున జరగనున్న ఎన్నికల్లో ప్రవాసాంధ్రుడు చివుకుల ఉపేంద్ర ఏడోసారి పోటీ చేస్తున్నారు. అధికార డెమోక్రాటిక్ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి ఉపేంద్ర దిగుతున్నారు. న్యూజెర్సీ రాష్ట్రంలో సోమర్ సెట్ కౌంటీ ప్రాంతం నుంచి ఆయన గత ఆరుసార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. ఈసారి కూడా అదే స్థానం నుంచి బరిలోకి దిగడం విశేషం.