: గోషామహల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ


హైదరాబాద్ లోని గోషామహల్ పొలీస్ స్టేడియంలో ఈ రోజు ఉదయం పోలిస్ అమరవీరుల సంస్మరణ దినం జరిగింది. ఈ సందర్భంగా విధి నిర్వహణలో అమరవీరులైన పోలీసులకు ముఖ్యమంత్రి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సమాజంలో పోలీసు శాఖపై ప్రత్యేక దృష్టి ఉందని, నిరంతరం జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా పోలీసులపై ఒత్తిడి పెరుగుతోందని, దానిని తగ్గించేందుకు గత మూడేళ్ల కాలంలో 28వేల మంది కానిస్టేబుళ్ల నియామకం జరిపామని తెలిపారు. పోలీసులకు అందాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని, డీజీపీ సూచనల మేరకు వాటిని మరింత మెరుగుపరచేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు దేశంలోనే అగ్రగామిగా నిలవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News