: 'టూ ఇన్‌ వన్‌ కార్‌' రానుంది!


రోడ్డుపై జామ్మంటూ దూసుకెళ్లే కార్ల గురించి మనందరికీ తెలుసు. అయితే అదే కారు నీటిలో కూడా దూసుకెళ్లేలా ఉంటే. అది నిజంగా జేమ్స్‌బాండ్‌ కారులాంటిదే అవుతుంది. 'ది స్పై హూ లవ్డ్‌ మీ' అనే జేమ్స్‌బాండ్‌ సినిమాలో హీరో రోజర్‌ మూర్‌ ఒక తెల్లని కారును ఉపయోగిస్తాడు. అది చక్కగా రోడ్డుపై దూసుకెళ్తూవుంటుంది. సముద్రంలోకి వెళ్లగానే అదే కారు చక్కగా జలాంతర్గామిలాగా మారిపోతుంది. అలాంటి కారును చూసిన వారు ఇలాంటి కారుంటుందా? అని ఆశ్చర్యాన్ని వెలిబుచ్చారు. ఈ సినిమా 1977లో వచ్చింది. ఇందులో హీరో ఉపయోగించిన కారును గత నెలలో వేలం వేయగా దాన్ని పదిలక్షల అమెరికన్‌ డాలర్లు వెచ్చించి ఎలాన్‌ మస్క్‌ అనే అమెరికాకు చెందిన వ్యాపారవేత్త సొంతం చేసుకున్నాడు.

మస్క్‌ కేవలం కారును కొనుక్కుని వదిలేయలేదు. సినిమాల్లో మాదిరిగానే దాన్ని నేలపైన, నీటిపైన నడిపించి చూపుతానంటున్నాడు. మస్క్‌కి చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ టెస్లా ఈ కారును రెండు విధాలుగా అభివృద్ధి చేయనుంది. నీటిలోకి వెళ్లగానే జలాంతర్గామిలాగా మారిపోయేలా ఈ కారును మార్పులు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ కారు గురించి మస్క్‌ మాట్లాడుతూ తన చిన్నతనంలో ఆ సినిమాను చూశానని, ఆ కారును నిజంగానే సినిమాలో లాగానే పనిచేసేలా చేస్తానని చెబుతున్నాడు.

  • Loading...

More Telugu News