: తెలుగు భాషాభివృద్ధితో ప్రాంతీయ విద్వేషాలు మాయం: లగడపాటి
తెలుగు భాషను అభివృద్ధి చేయడం ద్వారా ప్రాంతీయ విద్వేషాలను రూపుమాపవచ్చని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. గుంటూరులోని ఓ పాఠశాలలో తెలుగు తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న లగడపాటి విలేకరులతో మాట్లాడారు. తెలుగు అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తల్లి విగ్రహాలను ఏర్పాటు చేస్తే తెలుగు బంధం మరింత పటిష్టమవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇక, రాజధానిలో నిఘా వైఫల్యానికి ప్రాంతీయ భేదాలే కారణమని లగడపాటి సూత్రీకరించారు. పోలీసులు.. విద్వేషాల కారణంగా నెలకొనే ఆందోళనలు, నిరసన కార్యక్రమాలపై దృష్టి పెడుతుంటే.. ఇదే అదనుగా అసాంఘిక శక్తులు ప్రవేశిస్తున్నాయని లగడపాటి అన్నారు.