: వణికితే చాలు... కొవ్వు కరిగిపోతుందట!


చల్లని ప్రదేశంలో ఉండేవారు చక్కగా గదిలోనుండి బయటికి వచ్చి కాసేపు చలికి గడగడ వణికితే చాలు ఇట్టే మీ శరీరంలోని కొవ్వు కరిగిపోతుందట. అయితే ఇలా ఉత్తినే మంచులో ఉండి వణికితే సరిపోదండోయ్‌ అలా వణుకుతూ ఘాటైన మిర్చి వంటకాలను రుచిచూస్తూ ఉండాలి. అప్పుడే మీ శరీరంలోని కొలెస్టరాల్‌ కరిగిపోతుందంటున్నారు పరిశోధకులు.

జపాన్‌లోని హొకైడో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో భాగంగా కొంతమందిని ఎంపిక చేసుకున్నారు. వారిని రెండుగా విభజించి రోజూ రెండు గంటలపాటు 17 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన గదిలో మామూలుగా ఉంచారు. మరికొంతమందిని మిరపకాయల్లో ఉండే ఘాటైన క్యాప్సినాయిడ్‌లను ఆహారంలో అందించి వారిని కూడా అలాంటి గదిలోనే ఉంచారు. ఆరు వారాల తర్వాత వారిని పరిశీలించగా చలిలో ఘాటైన రుచి చూసిన వారిలో మిగిలిన వారితో పోల్చుకుంటే ఐదు శాతం కొవ్వు తగ్గినట్టు, ఎక్కువ శక్తి ఖర్చయినట్టు పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా మన శరీరంలో బ్రౌన్‌, వైట్‌ ఫ్యాట్‌ సెల్స్‌ అనే రెండు రకాలైన కొవ్వు కణాలుంటాయి. వాటిలో వైట్‌ ఫ్యాట్‌ సెల్స్‌ శక్తిని నిల్వ చేస్తుండగా బ్రౌన్‌ ఫ్యాట్‌ సెల్స్‌ మాత్రం శక్తిని ఖర్చు చేస్తాయి. అయితే చలి వాతావరణంలో మిరప ఘాటు వల్ల బ్రౌన్‌ ఫ్యాట్‌ సెల్స్‌ ఎక్కువగా ప్రభావితమై శక్తి ఎక్కువగా ఖర్చయినట్టు పరిశోధకులు కనుగొన్నారు.

  • Loading...

More Telugu News