: వైఎస్సార్సీపీ ఢిల్లీని ఎదిరించగలదా : పయ్యావుల
అవినీతితోపాటు విభజన విషయంలో కూడా జగన్, కిరణ్ కుమార్ రెడ్డిలు అవిభక్త కవలలని తెదేపా నేత పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లోని టీడీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై కానీ, పార్లమెంట్ లో విభజనకు వ్యతిరేకంగా కానీ తమ పార్టీ నాయకులే పోరాడుతున్నారని అన్నారు. విభజన సమస్యకు మూలం ఢిల్లీలో ఉందని... ఢిల్లీని ఎదిరించే దమ్ము వైకాపాకు ఉందా? అని పయ్యావుల ప్రశ్నించారు. కాంగ్రెస్, వైకాపా మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల రాయలసీమ సిగ్గుపడే పరిస్థితి తలెత్తిందని అన్నారు.