: రాష్ట్రం విడిపోవడం ఖాయం : పనబాక లక్ష్మి
రాష్ట్ర విభజన జరగడం తథ్యమని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తాను సమైక్యవాదినైనప్పటికీ... అధిష్ఠానం తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకించలేనని అన్నారు. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతానికి ఎలాంటి నష్టం వాటిల్లదని... ఒక వేళ జరిగితే చూస్తూ ఊరుకోమని అన్నారు. రాష్ట్రం విడిపోతే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని పనబాక తెలిపారు.