: మత్స్యకారులకు రూ. 40 కోట్ల నిధులను కేటాయిస్తున్నాం : సీఎం
ఫైలిన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా డొంకూరులోని మత్స్యకారులతో ముఖ్యమంత్రి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ... జిల్లాలోని మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం రూ. 40 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. డొంకూరు గ్రామాభివృద్ధి కోసం మరో రూ. 5 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా, తుఫాన్ వల్ల నష్టపోయిన కొబ్బరి, మామిడి, జీడి రైతులకు రెట్టింపు కంటే ఎక్కువ పరిహారం అందజేసేందుకు ప్రయత్నిస్తానని ప్రకటించారు.