: మద్యం దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు
ఖమ్మం జిల్లా భద్రాచలం పరిసర ప్రాంతాల్లో అక్రమ మద్యం దుకాణాలపై ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే, దాడులు జరగబోతున్నాయన్న సమాచారం ముందుగానే తెలియడంతో... దుకాణాలు నిర్వహిస్తున్నవారు షాప్ లను మూసేశారు. అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్న వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.