: కిలోమీటర్ ప్రయాణం.. మూడు పైసలే


మనిషి జీవన వ్యయం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఆటోఎక్కి దిగితే 5 రూపాయలకు తక్కువ లేదు. మోటార్ సైకిల్ తీసినా కిలోమీటర్ కు రెండు రూపాయల ఇంధనం అవసరం. ఇవన్నీ వదిలేసి సైకిల్ నడుపుకుంటే పైసా ఖర్చు ఉండదు కదా.. కానీ ఎక్కువ దూరం తొక్కే ఓపిక లేని వారికీ, పెద్దగా ఖర్చుకాని సైకిల్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఈ సైకిల్ ను ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మురళీ కృష్ణ విజయవాడలో విడుదల చేశారు. కిలోమీటరు ప్రయాణానికి మూడు పైసలే ఖర్చవుతుందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. గంట చార్జ్ చేస్తే 40 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చన్నారు. చార్జింగ్ అయిపోతే మామూలు సైకిల్ వలే తొక్కుకుంటూ వెళ్లిపోవచ్చట.

  • Loading...

More Telugu News