: 16 మంది భారత జాలర్లను అదుపులోకి తీసుకున్న లంక నేవీ
తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారంటూ 16 మంది భారత జాలర్లను శ్రీలంక నావికా దళం అదుపులోకి తీసుకుంది. వాయువ్య ప్రాంతమైన కల్పితియ వద్ద ఆదివారం 3 బోట్లతో భారత జాలర్లు తమ జలాల్లోకి అడుగుపెట్టారని శ్రీలంక నేవీ వెల్లడించింది.
కాగా, లంక నావికాదళం తదుపరి విచారణ నిమిత్తం వారిని కల్పితియ పోలీసులకు అప్పగించింది. ఇటీవల కాలంలో ఇరు దేశాలకు చెందిన మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలు తరచు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో భారత, లంక జాలర్లు పరస్పరం ఘర్షణలకు పాల్పడుతున్నారు.