: ఎన్డీయేలో చోటు కోసం యడ్యూరప్ప అభ్యర్థన
బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమిలో తనను చేర్చుకోవాలని కర్ణాటక జనతా పార్టీ(కేజేపీ) అధ్యక్షుడు యడ్యూరప్ప కోరారు. ఈ మేరకు బీజేపీ నాయకత్వానికి ఆయన ఒక లేఖ రాశారు. తన పార్టీని ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా పరిగణించి, ఎన్డీయే సమావేశాలకు తనను ఆహ్వానించాలని కోరారు. కర్ణాటక సీఎం కుర్చీ నుంచి తనను తప్పించారనే అక్కసుతో యడ్యూరప్ప బీజేపీ నాయకత్వంతో విభేదించి పార్టీని వీడి కేజేపీని స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే, శాసనసభ ఎన్నికల్లో బోల్తా కొట్టడంతో మళ్లీ బీజేపీకి దగ్గరయ్యేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. యడ్యూరప్ప లాంటి మిత్రులను తిరిగి పార్టీలోకి తీసుకురావాలని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నికైన తర్వాత మోడీ ప్రకటించిన సంగతి విదితమే.