: మణిపూర్ లో అగ్నిపర్వతం బద్ధలు


మణిపూర్ లో ఒక అగ్నిపర్వతం బద్ధలైనట్లు భావిస్తున్నారు. మయన్మార్ సరిహద్ధుల్లో ఉక్రుల్ జిల్లా తుసామ్ గ్రామం సమీపంలోని కొండ నుంచి పెద్ధ విస్ఫోటనం చప్పుడు వినిపించిందని స్థానిక ప్రజలు తెలిపారు. బండరాళ్లు దొర్లాయని, లావా లాంటి ద్రవపదార్థం చెట్లను ముంచెత్తిందని చెబుతున్నారు. స్థానికులను ఇతర ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు. ఈ ఘటన ఈ నెల 13న జరగగా ఇప్పటికీ ఆ కొండపై నుంచి నీరు, బురద విడుదల అవుతూనే ఉందని పేర్కొన్నారు.

జిల్లా నుంచి టుసాన్ గ్రామం 120 కిలోమీటర్ల దూరంలో అటవీ, పర్వత ప్రాంతంలో ఉండడం, సరైన రహదారులు లేకపోవడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పేలింది అగ్నిపర్వతమా, కాదా? అన్నది తేలడానికి సమయం పడుతుందంటున్నారు. టుసాన్ ప్రాంతం ఆ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ప్రిషో నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. సహాయక చర్యలు చేపట్టాలని, నష్టం అంచనా వేయాలని ఆదేశించినట్లు ప్రిషో తెలిపారు.

  • Loading...

More Telugu News