: సోనియా, మన్మోహన్ దుర్మార్గులు: గాదె
మాజీ ప్రధాని ఇందిర, రాజీవ్ గాంధీలు రాష్ట్ర విభజనకు ఒప్పుకోలేదని అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మన్మోహన్ సింగ్, సోనియాలను ఐదున్నర కోట్ల మంది సీమాంధ్రులు దుర్మార్గులుగా భావిస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి అన్నారు. తెలుగు జాతిని ముక్కలు చేస్తున్నవీరిని భవిష్యత్ తరాలు దుర్మార్గులుగా భావిస్తాయని పేర్కొన్నారు. వారిని చరిత్ర క్షమించదని చెప్పారు. బాపట్లలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు. శాసనసభ తీర్మానం లేకుండా ఇంతవరకూ ఏ రాష్ట్రాన్నీ విభజించలేదని, ఆంధప్రదేశ్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా, రాజ్యాంగ విధివిధానాలు పాటించకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. విభజన బిల్లు శాసనసభకు వస్తే అడ్డుకుంటామని ప్రకటించారు.