: ఆర్టీసీ బస్సుల్లో తొలిసారిగా సమాచార వ్యవస్థ


ఆర్టీసీ బస్సుల్లో మొట్టమొదటిసారిగా ప్రయాణికులకు అవసరమైన సమాచార వ్యవస్థ, నిఘా రవాణా వ్యవస్థను ప్రవేశ పెడుతున్నట్టు ఆ సంస్థ ఎండీ ఏకే ఖాన్ తెలిపారు. తొలుత హైదరాబాద్ నగరం, హైదరాబాద్ -విజయవాడ, హైదరాబాద్ -కరీంనగర్ మార్గాల్లో నడిచే 3500 బస్సుల్లో ఈ వ్యవస్థలను 40 రోజుల్లోగా ఏర్పాటు చేస్తామని విశాఖలో నిన్న ఆయన మీడియాకు వెల్లడించారు. దీని ద్వారా వాహనాలు ఎక్కడున్నాయి, ఇంకా ఎంత సమయంలో గమ్యానికి చేరబోతున్నామనే వివరాలను ఎలక్ట్రానిక్ డిస్ ప్లే ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చన్నారు.

  • Loading...

More Telugu News