: రాష్ట్రం ఇప్పట్లో విడిపోదు: ఉండవల్లి


రాష్ట్రం ఇప్పట్లో విడిపోదని ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జోస్యం చెప్పారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలలో తెలంగాణ బిల్లు రాదని చెప్పారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో తీర్మానం వీగిపోవడం ఖాయమన్నారు. అది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుందని చెప్పారు. ఏపీఎన్జీవోలు సమ్మె విరమించడం సరైన చర్యేనని ఉండవల్లి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని రెండు ప్రాంతాలకు సమానమేనని, అందుకే నాడు ఇందిరాగాంధీ ముల్కీ నిబంధనలను రద్దు చేస్తున్నామని చెప్పినట్లుగా పేర్కొన్నారు.

వివాదమంతా రాజధాని విషయంలోనే ఉందని, అందుకే సీమాంధ్రుల ఉద్యమం తీవ్ర రూపం దాల్చిందన్నారు. ఈ స్థాయి ఉద్యమాన్ని తానిప్పటి వరకూ చూడలేదన్నారు. ఉద్యమ తీవ్రతను జాతీయ స్థాయికి తీసుకెళ్లగలిగామని చెప్పారు. కలిసి ఉండడం వల్ల తెలంగాణ ప్రజలే ఎక్కువగా లబ్ధి పొందారని చెప్పారు. తెలంగాణలో ఉన్నంత వివక్ష, దొరతనం సీమాంధ్రలో లేవన్నారు. తెలంగాణ ఉద్యమం లేదని కేసీఆరే 12 ఏళ్ల క్రితం ఒప్పుకున్నారని, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని అభివర్ణించారు.

  • Loading...

More Telugu News