: సోమాలియా ఆత్మాహుతి దాడిలో 16 మంది మృతి
సైనికులు, సాధారణ పౌరులతో కిటకిటలాడుతున్న హోటల్ లోకి బాంబు ధరించిన వ్యక్తి ప్రవేశించి... అందరూ చూస్తుండగానే తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటన సోమాలియా దేశ సరిహద్దు ప్రాంతంలో ఉన్న బలద్వీని పట్టణంలో జరిగింది. ఈ ఘటనలో 16 మంది అమాయకులు చనిపోయారు. మరో 33 మంది గాయపడ్డారు. బలద్వీనిలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో మరికొంత మంది మృతి చెందే అవకాశం ఉందని స్థానిక నాయకుడు తెలిపారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఆల్ ఖైదా తీవ్రవాద అనుబంధ సంస్థ ఆల్ షబాబ్ ప్రకటించింది. సోమాలియా, ఇథియోపియా సరిహద్దు ప్రాంతంలో స్థానికులు, విదేశీ సైనికులపై ఆల్ ఖైదాకు చెందిన తీవ్రవాదులు తరచుగా దాడులకు పాల్పడుతున్నారు.