: థాయ్ లాండ్ ను ముంచెత్తిన వరదలు : 73 మంది మృతి
థాయ్ లాండ్ లోని ఈశాన్య, మధ్య భూభాగంలో సంభవించిన వరదల కారణంగా ఇప్పటిదాకా 73 మంది మృతి చెందారు. దాదాపు 7 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దేశంలోని దాదాపు 22 ప్రావిన్సుల్లోని 4 వేల పట్టణాలను వరద ముంచెత్తి బీభత్సం సృష్టించింది. వరద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలనుంచి దాదాపు ఎనిమిది వేల మందిని బలవంతంగా పునరావాస కేంద్రాలకు పంపించారు.