: యువకుడిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు


ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకలలో ఈ రోజు తెల్లవారుజామున ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పాకలకు చెందిన ఓ యువకుడిని కొంత మంది దుండగులు బలవంతంగా శ్మశానానికి తీసుకెళ్లి... అతనిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. మంటల్లో కాలిపోతున్న యువకుడు కేకలు వేయడంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో, ఆగంతకులు అక్కడ నుంచి పారిపోయారు. అప్పటికే యువకుడి శరీరం చాలా భాగం కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News