: రైళ్లలో ప్యాంట్రీకార్లకు మంగళం


దూర ప్రాంత రైళ్లలో.. లోపలే తినుబండారాలను తయారు చేసి విక్రయించే ప్యాంట్రీకార్లను ఎత్తేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నాయనే ఉద్దేశంతో వీటిని పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని రైల్వే బోర్డు సమావేశంలో అభిప్రాయపడ్డారు. దీనిపై నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. ప్రధాన రైల్వే స్టేషన్లలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల ఏర్పాటు ద్వారా రైలు ప్రయాణికుల అవసరాలను తీర్చాలని భావిస్తున్నారు. వీటికి టెండర్లు కూడా పూర్తయ్యాయని సమాచారం. దీంతో ప్యాంట్రీ కార్లను ఎత్తివేయడం ఖాయమనే చెప్పవచ్చు.

  • Loading...

More Telugu News