: ఓటు హక్కు వినియోగించుకునేలా కృషి చేస్తాం: భన్వర్ లాల్
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కృషి చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ అన్నారు. అందుకు ఎన్నికల కమిషన్ అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. తిరుపతిలో ఓటరు జాబితా సవరణపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండాలని సూచించారు. రాష్ట్రంలో 38 శాతం యువత ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి విముఖత చూపుతున్నారని, వీరంతా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.