: రెండు మూడు రోజుల్లో రాష్ట్రానికి ఈశాన్య రుతుపవనాలు
రాష్ట్ర రైతన్నకు శుభవార్త! మరో రెండు రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రాన్ని పలకరించనున్నాయి. దేశం నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం మరో నాలుగైదు రోజుల్లో పూర్తి కానుంది. ఈ నెల 22 నాటికి మన రాష్ట్రంతో సహా తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో ఈశాన్య జల్లులు కురుస్తాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇప్పటికే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది మరింత బలపడి రాగల 48 గంటల్లో అల్పపీడనంగా మారుతుందని అధికారులు తెలిపారు.