: రాష్ట్రం కాంగ్రెస్ జాగీరు కాదు: జేపీ
ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడానికి రాష్ట్రం కాంగ్రెస్ జాగీరు కాదని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఒక రాష్ట్ర ఉనికికి సంబంధించిన విషయాన్ని ఆ రాష్ట్రంలోనే చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా, అహంకార పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఢిల్లీలో ఉన్నది ప్రభుత్వమా? లేక ప్రైవేటు కంపెనీయా? అని జేపీ సూటిగా నిలదీశారు. దేశ భవిష్యత్తుపై అవగాహన ఉన్న ఏ ప్రభుత్వమైనా ఇలాగేనా చేసేది? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి కేంద్ర ప్రభుత్వ పెద్దలు నెహ్రూ, పటేల్ ల కంటే గొప్పవాళ్లా? అని అన్నారు. అందరినీ కూర్చోబెట్టి పరిష్కారం చేయకుంటే.. విభజనను ఆపాలన్నారు. ఢిల్లీలో కూర్చొని ఈ-మెయిళ్ల ద్వారా సమాచారం తీసుకుంటామని చెప్పడం హాస్యాస్పదమని జేపీ ఎద్దేవా చేశారు.