: టీడీపీ ఎంపీలకు షిండే షాక్ ట్రీట్ మెంట్


టీడీపీ ఎంపీలకు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర మంత్రుల బృందం సమావేశం ప్రారంభానికి ముందు పార్లమెంటు నార్త్ బ్లాక్ ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. షిండే నార్త్ బ్లాక్ కు చేరుకునే సరికి టీడీపీ ఎంపీలు శివప్రసాద్, మోదుగుల, నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో షిండే విభజన ఎలా చేయాలో తమకు తెలుసని చెబుతూ, ఇంకా ఎందుకీ ఆందోళనలు? అంటూ వారిని ప్రశ్నించారు. దీంతో విభజన వల్ల చాలా సమస్యలు వస్తాయని షిండేకు వివరించారు.

దీంతో షిండే మీ పార్టీ అధినేతే విభజన చేయాలంటూ లేఖ ఇచ్చారని, ఇంకా సమస్యలు ఎందుకు వస్తాయని ఆయన ఎదురు ప్రశ్నించారు. ఇంకా ఏవైనా అనుమానాలుంటే విభజనపై స్పష్టంగా ఉన్న చంద్రబాబును అడిగి నివృత్తి చేసుకోండంటూ సూచించారు. అయినప్పటికీ సీమాంధ్రుల సమస్యలు పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. దీంతో టీడీపీ ఎంపీలు షాక్ తిన్నారు.

  • Loading...

More Telugu News