: ఏసీ గదుల్లో కూర్చుని ఎలా న్యాయం చేస్తారు?: ఎంపీ శివప్రసాద్
ఏసీ గదుల్లో కూర్చుని ఎలా న్యాయం చేస్తారని టీడీపీ ఎంపీ శివప్రసాద్ కేంద్రమంత్రుల బృందాన్ని ప్రశ్నించారు. కేంద్ర మంత్రుల బృందం సమావేశం జరుగుతున్న పార్లమెంటు నార్త్ బ్లాక్ వద్ద టీడీపీ ఎంపీలు శివప్రసాద్, మోదుగుల, నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కావాలంటే విభజన చేసుకోండి కానీ, లోపభూయిష్టమైన విభజన చేయొద్దని డిమాండ్ చేశారు.