: వైఎస్ డైరీని జగన్ చదవాలి : పొన్నం
రాజ్యాంగ బద్ధంగా జరుగుతున్న విభజనను ఎవరూ అడ్డుకోలేరని ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. పూటకో మాట మాట్లాడే వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో జగన్ ఆలోచించుకోవాలని విమర్శించారు. తెలంగాణ గురించి ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే జగన్ తన తండ్రి వైఎస్ డైరీని చదవాలని సూచించారు.