: రష్యా, చైనా పర్యటనలకు రేపు వెళ్లనున్న ప్రధాని


రష్యా, చైనాలలో ఐదు రోజుల పర్యటనను ప్రధాని మన్మోహన్ సింగ్ రేపటి నుంచి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాలతోనూ రెండు కీలక ఒప్పందాలు జరిగే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. తమిళనాడులో ఏర్పాటు చేస్తున్న కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టుకు రష్యా నుంచి మరో రెండు రియాక్టర్ల కొనుగోలుకు ఒప్పందం కుదరనుంది. ఇక ఇటీవలి కాలంలో చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల సైన్యం మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. చైనా సైనికులు చీటికి మాటికీ భారత సరిహద్దుల్లోకి ప్రవేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటిని నివారించేందుకు చైనాతో ఒప్పందం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. అందులో భాగంగా ముందుగా ప్రధాని రష్యా వెళతారు.

అణు విద్యుత్ ప్రాజెక్టులలో ప్రమాదం తలెత్తితే పౌరులకు వాటిల్లే నష్టానికి.. అణు రియాక్టర్లను సరఫరా చేసిన వారూ బాధ్యులుగా భారత చట్టం పేర్కొంటోంది. నష్ట పరిహారం చెల్లించాలని నిర్దేశిస్తోంది. దీనిపై రష్యా ఆందోళన, అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. దీనికి సంబంధించి సానుకూల పరిష్కారం లభించి ఒప్పందం కుదురుతుందని అధికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News