: మైనర్ అయినా ప్రేమించినోడితో వెళ్లిపోతే నేరం కాదు: కోర్టు


18ఏళ్లు నిండకపోయినా ప్రేమ కోసం, పెళ్లికోసం ఒక బాలిక తల్లిదండ్రుల నుంచి వెళ్లిపోవడం నేరం కాదని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు స్పష్టం చేసింది. అలాంటి వారికి తగిన రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. తల్లిదండ్రుల అభిమతానికి విరుద్ధంగా పెళ్లాడే జంటకు రక్షణ కల్పించాలని, ఇది సాధారణమేనని పేర్కొంది. తన కూతురికి బలవంతంగా పెళ్లి చేసే హక్కు తండ్రికి లేదని, ఆమెకు 18 ఏళ్లు నిండకపోయినా ఇదే వర్తిస్తుందని స్పష్టం చేసింది.

అలాగే, ఇతర మతస్థుడిని పెళ్లాడుతున్నదని కూతుర్ని హత్యచేసే హక్కు కూడా తండ్రికి ఉండదని పేర్కొంది. పంజాబ్ లో పరువు హత్యలు పెరిగిపోతుండడంతో కోర్టు తాజా ఆదేశాలు ప్రేమికులకు రక్షణ కల్పించేందుకు తోడ్పడనున్నాయి. తమకు రక్షణ కల్పించాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రేమలో ఉన్న బాలిక ముందు తనకు 18 ఏళ్లు నిండే వరకు ఆగడం లేదా తల్లిదండ్రుల ఆమోదంతో పెళ్లి చేసుకోవడమనే రెండు అవకాశాలు ఉన్నాయని సూచించింది.

  • Loading...

More Telugu News