: దూసుకుపోతున్న గూగుల్ షేరు
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సంస్థ షేరు విలువ అమెరికన్ స్టాక్ ఎక్సేంజి నాస్డాక్ లో దూసుకుపోతోంది. ఏకంగా వెయ్యి డాలర్ల (61,000)స్థాయిని దాటింది. ఈసారి గూగుల్ ఆర్ధిక ఫలితాలు మరింత ఆకర్షణీయంగా ఉండటంతో షేరు విలువ పెరిగింది. ట్రేడింగ్ ప్రారంభంలో 13 శాతం పైకి వెళ్లి 1,007.40 డాలర్లను తాకింది. దీనిద్వారా వెయ్యి డాలర్ల మార్కును అధిగమించిన రెండో అమెరికన్ సంస్థగా గూగుల్ నిలిచింది. కేవలం తొమ్మిది సంవత్సరాల వ్యవధిలో కంపెనీ షేరు, మార్కెట్ విలువ అనేక రెట్లు పెరిగాయి. 2004లో ఐపీవోకి వచ్చిన గూగుల్ షేరు ధర 85 డాలర్లుగా నిర్ణయించింది.