: కల కాదు.. నిజాల ఆధారంగానే బంగారం అన్వేషణ: కేంద్రం


ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావో జిల్లా దాండియా ఖేరా గ్రామంలోని ప్రాచీన కోటలో తగిన ఆధారాలతోనే బంగారం కోసం అన్వేషణ ప్రారంభించామని కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రకటించింది. అంతేకానీ సాధువుకి వచ్చిన కల ఆధారంగా కాదని స్పష్టం చేసింది. ఈ కోటలో 1000 టన్నుల బంగారం ఉందంటూ తనకు కల వచ్చిందని శోభన్ సర్కార్ అనే సాధువు కేంద్ర మంత్రికి చెప్పడం, తర్వాత భారత పురావస్తు సర్వే విభాగం(ఏఎస్ఐ) శుక్రవారం నుంచి తవ్వకాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.

దీనిపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, సీపీఎం నేత సీతారాం ఏచూరీ సహా పలువురు విమర్శలు చేశారు. ఎవరికో వచ్చిన కల ఆధారంగా తవ్వకాలు జరిపే దుస్థితికి ప్రభుత్వం వచ్చిందంటూ విమర్శించారు. దీంతో కేంద్ర సాంస్కృతిక శాఖ వివరణ ఇచ్చింది. భారత భూభౌతిక సర్వే విభాగం సదరు కోటలో 5 నుంచి 20 మీటర్ల లోతులో లోహాలు ఉండవచ్చంటూ నివేదిక ఇచ్చిందని, దాని ఆధారంగానే తవ్వకాలు మొదలయ్యాయని తెలిపింది.

  • Loading...

More Telugu News