: లాలూ అనర్హత వేటుకు సిఫారసు


శిక్షపడిన ఎంపీలపై అనర్హత వేటుకు అటార్నీ జనరల్ సిఫారసు చేశారు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ నేత, ఎంపీ లాలూ ప్రసాద్ యాదవ్ తో పాటు జగదీష్ శర్మలపై అనర్హత వేటుకు అటార్నీ జనరల్ సిఫారసు చేశారు. ఇదే సమయంలో రాజ్యసభ సభ్యుడు రషీద్ మసూద్ పై కూడా అనర్హత వేటుకు రాజ్యసభ సెక్రటేరియట్ రంగం సిద్ధం చేసింది. ఖాళీ అవుతున్న రెండు లోక్ సభ స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయాలని లోక్ సభ కార్యదర్శికి అటార్నీ జనరల్ సూచించారు.

  • Loading...

More Telugu News