: విభజిస్తే తిరుగుబాటే: లగడపాటి
తమ మాట వినకుండా రాష్ట్రాన్ని విభజిస్తే... తామంతా పదవులు వదులుకుని పార్టీ అధిష్ఠానంపై తిరుగుబాటు చేస్తామని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ హెచ్చరించారు. కొన్ని పార్టీల వల్లే విభజన పరిస్థితులు ఏర్పడ్డాయని, అలాంటి పార్టీలను బండకేసి కొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన దిశగా లేఖలు ఇవ్వవద్దంటూ వేడుకున్నామని పరోక్షంగా టీడీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.