: పురాతన దేవతా విగ్రహాల చోరీ
తమిళనాడులోని నాగపట్టణం జిల్లా కదావసల్ లో ఉన్న ప్రసిద్ధ శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయంలో దొంగలు పడ్డారు. ఆలయంలోని పురాతన కంచు విగ్రహాలను ఎత్తుకెళ్లారు. ఈ ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకుడు... దేవాలయం గర్భగుడి ద్వారాలు బద్దలు కొట్టి ఉండడం, లోపల శ్రీదేవి, భూదేవి, వరదరాజ పెరుమాళ్, హనుమంతుడి విగ్రహాలు మాయమవడం గుర్తించారు. దీంతో వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.