: విజయనగరంలో కర్ఫ్యూ ఎత్తివేత
సమైక్య ఉద్యమంతో వేడెక్కిన విజయనగరం జిల్లాలో కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కార్తికేయ తెలిపారు. దాంతో, విజయనగరంలో నేటినుంచి సాధారణ పరిస్థితులు నెలకొనబోతున్నాయి. ఇకనుంచి ప్రజలు ప్రశాంతంగా రోడ్లపై తిరగవచ్చని ఎస్పీ చెప్పారు. కానీ, పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈనెల 21, 22, 23 తేదీల్లో పైడితల్లమ్మ పండగ జరగనుండటంవల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు బొత్స సత్యనారాయణ విజయనగరంలో పర్యటించనున్నారు. సమ్మెలు, ధర్నాలు, ఘర్షణలతో విజయనగరం పదమూడు రోజుల పాటు అట్టుడికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.