: రావూరి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించండి: సీఎం
ప్రముఖ సాహితీవేత్త రావూరి భరద్వాజ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. రావూరి అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం హైదరాబాద్ లోని విజయ్ నగర్ కాలనీ స్మశాన వాటికలో జరగనున్నాయి. కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న రావూరి కేర్ ఆస్పత్రిలో గత రాత్రి తుదిశ్వాస విడిచారు. 2012 సంవత్సరానికి గాను ఆయన రాసిన 'పాకుడురాళ్లు' పుస్తకానికి రావూరి భరద్వాజ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకున్నారు.