: ఈ రోజు మరోసారి సమావేశమవుతున్న కేంద్ర మంత్రుల బృందం
రాష్ట్ర విభజనకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసేందుకు కేంద్ర మంత్రుల బృందం ఈ రోజు మరోసారి భేటీ కానుంది. సాయంత్రం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. హోం మంత్రి షిండే అధ్యక్షతన జరగే ఈ సమావేశానికి ఆంటోనీ, చిదంబరం, గులాంనబీ అజాద్, వీరప్ప మొయిలీ, జైరాం రమేష్ తో పాటు ప్రత్యేక ఆహ్వానితునిగా సహాయమంత్రి నారాయణ స్వామి హాజరవుతున్నారు.
మంత్రుల బృందానికి అవసరమైన వివరణలు, సమాచారం ఇవ్వడానికి రాష్ట్రానికి చెందిన సాగునీటి పారుదల, ఆర్థిక, హోం, విద్యుత్, మౌళిక సదుపాయాల శాఖల ముఖ్య కార్యదర్శులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.