: మీ మెదడును ఇలా శుభ్రం చేసుకోండి


మెదడును శుభ్రం చేసుకోవడం ఏంటి అనుకుంటున్నారా... మీ మెదడు మీ రోజువారీ పనుల వల్ల అలసిపోయి ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని శుభ్రం చేసుకుంటే మరునాటికి మరింత ఉల్లాసంగా మీరు పనిలోకి దిగవచ్చు. మెదడుకు దుమ్ము పడుతుందా... దాన్ని శుభ్రం చేసుకోవడానికి అనుకుంటున్నారా... దుమ్ము కాదుగానీ పనివల్ల మెదడు బాగా అలసిపోయి ఉంటుంది. ఇలా అలసిన మెదడు సేదతీరాలంటే ఒక్కటే మార్గం. అది చక్కగా కంటినిండా నిద్రపోవడం.

న్యూయార్క్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో చక్కగా కంటినిండా నిద్రపోవడం వల్ల మన మెదడు శుభ్రపడుతుందని తేలింది. ఎందుకంటే గాఢనిద్ర వల్ల మెదడు కణాలమధ్య దూరం పెరుగుతుందట. దీనివల్ల మెదడులోని కలుషితాలన్నీ కొట్టుకుపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు మనం నిద్రపోయే సమయంలో మెదడులో 'గ్లింఫాటిక్‌ సిస్టమ్‌' అనేది చాలా చురుగ్గా పనిచేయడంతో మన మెదడు శుభ్రపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి రోజూ కంటినిండా నిద్రపోండి. మీ మెదడును పరిశుభ్రంగా ఉంచుకోండి.

  • Loading...

More Telugu News