: అల్లంత దూరాన వున్న విమానాలను కూడా చూడవచ్చు


ఐదు మైళ్ల దూరంలో ఉండే విమానాన్ని చూడగలమా... మామూలుగా అయితే చూడలేం. కానీ అక్కడికి వెళితే మాత్రం చక్కగా చూడగలం. ఎందుకంటే అంత దూరంలో ఉండే పెద్ద విమానం అక్కడికి వెళితే చక్కగా కనిపిస్తుంది. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో అత్యంత ఎత్తైన ఏటీసీ టవర్‌ను జీవీకే ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు కంపెనీ ప్రారంభించింది. దాదాపు 30 అంతస్తుల భవనానికి సమానమైన 83.8 మీటర్ల ఎత్తులో నిర్మించిన దీనిపైనుండి చూస్తే ఐదు మైళ్ల దూరం వరకూ కనిపిస్తుందట. దీనిపైనుండి విమానాల రన్‌వే, అప్రోచ్‌ ఏరియా ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. దీనివల్ల ముంబైలో విమానాల రాకపోకలు ఎంతో సురక్షితంగా ఉండడంతోబాటు ఎయిర్‌ ట్రాఫిక్‌ నిర్వహణ సామర్ధ్యం కూడా పెరుగుతుందని జీవీకే సంస్థ చెబుతోంది. అంత ఎత్తైన టవర్‌కు హాంకాంగ్‌ బిల్డింగ్‌ ఇన్ఫర్మేషన్‌ మోడలింగ్‌ అవార్డుతోబాటు ఇంకా పలు అవార్డులు కూడా లభించాయని సంస్థ చెబుతోంది.

  • Loading...

More Telugu News