: ఆరాధ్యే తన బాటను నిర్ణయించుకుంటుంది: అభిషేక్
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యల గారాలపట్టి ఆరాధ్య. వయసు ఏడాది మీద మూడు నెలలే. తాత, నానమ్మ, తండ్రి, తల్లిలా ఆరాధ్య కూడా పెద్ద స్టార్ అవుతుందా? అందరి మనసుల్లోకి అప్పుడే ఈ సందేహం వచ్చేసింది. ఇంకేముంది, మీడియా వాళ్లు కూడా ఇదే సందేహాన్ని అభిషేక్ ముందు వ్యక్తం చేయగా ఆయనిలా బదులిచ్చారు.
తన కెరీర్ నిర్ణయించుకోవడంలో పూర్తి స్వేచ్ఛ ఆరాధ్యదేనని చెప్పారు. తల్లిదండ్రులుగా ప్రేమను పంచుతూ, జాగ్రత్తలు తీసుకుంటూ మంచి చదువునివ్వడమే తమ బాధ్యత అని అభిషేక్ అన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ఎటువంటి ఐడియాలు రుద్దకూడదన్నారు. బిడ్డ సంరక్షణ కేవలం తల్లిది మాత్రమే కాదని, తల్లిదండ్రులు ఇద్దరిపై ఆ బాధ్యత ఉంటుందని చెప్పారు.
ఆటిజం పిల్లల సంరక్షణ కోసం నిధుల సేకరణకు ఢిల్లీలో నిర్వహిస్తున్న కిడ్స్ ఫ్యాషన్ షోలో పాల్గొనడానికి ఢిల్లీకి వచ్చిన సందర్భంగా అభిషేక్ విలేకరులతో మాట్లాడారు. ఈ ఫ్యాషన్ షోలో అభిషేక్ సంతకం చేసిన టీ షర్టును 5 లక్షల రూపాయలు చెల్లించి ఎంపీ బైజయంత్ జయ్ పాండా సొంతం చేసుకున్నారు.