: సిడ్నీ సమీపంలో దావానలం... బూడిదవుతున్న వందలాది ఇళ్లు
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి దగ్గర్లో ఉన్న అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రగిలింది. ఇది అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే అగ్నికీలలకు దాదాపు వంద ఇళ్లు ఆహుతైపోయాయి. దావానలాన్ని ఆర్పడానికి అధికారులు ఎంతో శ్రమిస్తున్నా ఫలితం దక్కడంలేదు. దీంతో మరిన్ని ఇళ్లు అగ్నికి ఆహుతి అవబోతున్నాయి. అగ్నికీలలు వ్యాపిస్తున్న ప్రాంతం నుంచి వేలాది మందిని తరలిస్తున్నారు. అసాధారణమైన ఉష్ణోగ్రత, భీకర గాలులే ఈ ప్రమాదానికి కారణమని సహాయక చర్యలు చేపట్టిన అధికారులు తెలిపారు. ఈ దావానలంలో ఇప్పటివరకు ఒక వ్యక్తి చనిపోయినట్టు గుర్తించామని అధికారులు తెలిపారు.