: ట్విట్టర్ లో ఆర్మీ


భారతీయ సైన్యం ఇప్పడు ట్విట్టర్ ద్వారా దేశ ప్రజలను ట్వీట్ చేయనుంది. దేశభక్తులను ఎప్పటికప్పుడు సమాచారంతో పలకరించనుంది. ఇందుకోసం 'adgpi' పేరుతో ట్విట్టర్లో ఖాతా తెరిచేసింది. ఈ ఖాతాను ఆర్మీకి చెందిన అడిషినల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ నిర్వహిస్తుంది.

ఈ శుక్రవారమే ఇది ప్రారంభమైంది. అప్పుడే రెండువేల మంది ఫాలో అయిపోతున్నారు. అంతేకాదు, త్వరలో ఫేస్ బుక్, యూ ట్యూబ్ లోనూ ఖాతాలు తెరిచేయాలని ఆర్మీ భావిస్తోంది. వీటి ద్వారా సైన్యం గురించి అందరికీ తగినంత సమాచారం తెలియజేయడంతో బాటు, తగిన అవగాహన కల్పించేందుకు కృషి చేస్తారు. 

  • Loading...

More Telugu News