: రాజమండ్రి నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులు


వచ్చేనెల ఐదు నుంచి శబరిమలకు నాలుగు రకాల ప్రత్యేక సర్వీసులను రాజమండ్రి నుంచి నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ జి.రమాకాంత్ తెలిపారు. అలాగే, పంచారామాలకు నవంబరు 3, 10,17, 24 తేదీల్లో ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు చెప్పారు. నూతనంగా వచ్చిన 12 సూపర్ డీలక్స్ బస్సులు, 20 డీలక్స్ బస్సులను కూడా ఈ సర్వీసులకు ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. కాగా, గత ఏడాది శబరిమలకు 16 బస్సులు నడిపితే 19 లక్షల పైన ఆదాయం వచ్చిందని.. దాంతో, ఈ ఏడాది 50 బస్సులను తిప్పాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.

  • Loading...

More Telugu News