: మోడీ కాన్పూర్ సభకు తొలగిన అడ్డంకులు


రేపు మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జరగనున్న నరేంద్ర మోడీ సభకు అడ్డంకులు తొలగిపోయాయి. బీజేపీ తలపెట్టిన ఈ ర్యాలీ వల్ల తమ వ్యవసాయ భూముల్లోని పంటలు నాశనమవుతాయని కొందరు దళిత రైతులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే విషయాన్ని జిల్లా అధికారులకు తెలిపినా వారు పట్టించుకోలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో, మోడీ సభకు మార్గం సుగమమైంది.

బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎంపికైన తర్వాత ఉత్రరప్రదేశ్ లో మొదటిసారిగా మోడీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ ర్యాలీకి యూపీ బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. వంద అడుగుల విస్తీర్ణంలో సభా వేదికను నిర్మిస్తున్నారు. ఇంకొక విషయమేమిటంటే... ఈ వేదికను పూర్తిగా వాస్తుపరంగా నిర్మిస్తున్నారు. ఈ సభకు రాజ్ నాథ్ సింగ్ తో పాటు మరి కొంతమంది బీజేపీ అగ్రనేతలు హాజరుకానున్నారు. అంతేకాకుండా, సభకు భారీ సంఖ్యలో ముస్లింలను రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News