: సమైక్య శంఖారావం సభకు ప్రత్యేక రైళ్లు
ఈ నెల 26న హైదరాబాదులో వైఎస్సార్సీపీ నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభకు ఉత్తరాంధ్ర నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ నేత సుజయ కృష్ణ రంగారావు తెలిపారు. మరిన్ని రైళ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే ఇతర మార్గాల్లోనూ సభకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సభకు తరలిరానున్నట్లు ఆయన తెలిపారు.